- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటికి అనుమతులు ఎలా వచ్చాయి..?
విద్యా సంస్థలు కొన్ని నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చాలా సంస్థల్లో విద్యార్థుల కోసం ఉండాల్సిన మైదాన స్థలం, పయనించే వాహనాలకు పార్కింగ్ స్థలం లేకుండానే సంస్థలు కొనసాగిస్తున్నారు.

దిశ, ఖైరతాబాద్ : విద్యా సంస్థలు కొన్ని నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చాలా సంస్థల్లో విద్యార్థుల కోసం ఉండాల్సిన మైదాన స్థలం, పయనించే వాహనాలకు పార్కింగ్ స్థలం లేకుండానే సంస్థలు కొనసాగిస్తున్నారు. కానీ వారికి అనుమతులు ఎలా వచ్చాయనే ప్రశ్నలు వినిపిస్తుంది? నాణ్యమైన విద్య, మానసికంగా, శారీరికంగా కూడా బలంగా ఉండేలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి మంచి విద్యాసంస్థల్లో నానా కష్టాలు పడి వేలల్లో, లక్షల్లో ఫీజులు చలిస్తూ చెరిపిస్తుంటారు. కానీ, చాలాచోట్ల విద్యాసంస్థలు కేవలం విద్యా అనేది ఒక వ్యాపారంలానే చూస్తున్నారు. విద్యతోపాటు మానసికంగా, శారీరికంగా బలంగా ఉండేలా వారి క్రీడా నైపుణ్యాలను కూడా వెలికితీసేలా మైదాన ప్రదేశం ఉండాలి. కానీ కొన్ని కార్పొరేట్ సంస్థలు కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకొని కేవలం విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యనే బోధిస్తూ ఉండడం మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొంత శారీరికంగా కూడా బలంగా ఉండేలా వ్యాయామాలు, ఆటలు, పాటలు వంటి చేపట్టడానికి కొంత మైదానం ఉండాలి. కానీ, నిబంధనలు తుంగలో తొక్కుతూ మైదాన స్థలం లేకుండానే విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఫీజులు మాత్రం వేలల్లో , లక్షల్లో వసూళ్లు చేస్తారు. నిబంధనలు పాటించకుండా సంస్థలను ఇష్టారీతిలో వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తారు. కాబట్టి అలాంటి సంస్థలను గుర్తించి ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పార్కింగ్ స్థలం లేకున్నా ఎస్సార్ నగర్ లోని శ్రీ చైతన్య, భాష్యం విద్యా సంస్థలు విద్యార్థులు ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన బస్సులకు పార్కింగ్ స్థలం లేదు. ఉదయం, సాయంత్రం సమయంలో రోడ్ల పైన బస్సులు పార్కింగ్ చేస్తూ విద్యార్థులను ఎక్కిస్తుంటారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో ఎక్కించే సమయంలో విద్యార్థులకు ఇతర వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. బస్సుల కారణంగా అటువైపుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇక్కట్లు పడుతున్నారు. నిబంధనల ప్రకారం పార్కింగ్ స్థలం ఉండాలి కానీ విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ వారి వాహనాలను పెడుతున్నారని సిటిజన్లు మండిపడుతున్నారు. చదువుతోపాటు, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. విద్యాసంస్థలు ఏర్పాటు చేసేటప్పుడు మొదటగా నిబంధనల ప్రకారంగా మైదానం ఉండి తీరాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ మైదాన ప్రదేశం లేకుండానే విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. కానీ అధికారులు మాత్రం అటువైపు తొంగైనా చూడకపోవడం అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.






