- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు లేవు.. నిబంధనలు వర్తించవు!
టౌన్ ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాలకు అదుపు లేకుండా పోతోంది.

దిశ, కూకట్‌పల్లి : గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన కూకట్‌పల్లి సర్కిల్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్న అనుమతులు అవసరం లేదు, నిబంధనలు వర్తించవు అనే టాక్ వినబడుతోంది. రాజకీయ నాయకుల అండదండలు, అధికారులకు మామూళ్లు ఇస్తే చాలు ఎన్ని అంతస్తులైన నిబంధనలు పాటించకుండా ఇట్టే కట్టేయవచ్చు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌లో వార్డులు, సర్కిళ్ల పునర్‌విభజన జరగడంతో కూకట్‌పల్లి జోన్ పరిధిలో సర్కిళ్లలో భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మొన్నటి వరకు మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులు, కాలనీలు తాజాగా కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోకి రాగా కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఉన్న కాలనీలు మూసాపేట్ సర్కిల్‌లోకి చేరాయి.
మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఉన్న కేపీహెచ్‌బీ కాలనీ 1 నుంచి 15 ఫేజ్‌లు, గోపాల్ నగర్, బాలాజీనగర్ తదితర ప్రాంతాలు కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోకి వచ్చాయి. డీసీతో పాటు అన్ని శాఖల అధికారులు మారారు. దీంతో అధికారుల నిఘా లోపం, పాత అధికారుల పాపం కారణంగా అక్రమ నిర్మాణాల జోరు మరింత వేగంగా పెరిగిందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అధికారులు అన్ని చక్కదిద్దుకునే వరకు తమ నిర్మాణాలను పూర్తి చేసి వాటికి రంగులు పూయాలన్న విధంగా అక్రమ నిర్మాణదారులు పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సీజ్ చేసిన అక్రమ నిర్మాణాలకు ఉన్న సీజ్‌ను తొలగించి బిల్డర్లు నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలుస్తోంది. సర్కిల్ డీసీలు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నిఘా వైఫల్యం కారణంగానే ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ నాయకులకు పెరిగిన గిరాకి..
కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టాలన్న ఆయా రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్న వారు ముగ్గు వేయాలన్న నాయకుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసిందేనన్న చర్చ జోరుగా జరుగుతుంది.






