పుష్ప 2 సంఘటనలో సీఎస్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్ హెచ్ఆర్సీ

by Chintha Aamani |   (  Updated:2025-08-06 10:15:17  IST  )

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందిన సంఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్ ) రామకృష్ణారావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

పుష్ప 2 సంఘటనలో సీఎస్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్ హెచ్ఆర్సీ
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందిన సంఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్ ) రామకృష్ణారావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 18 కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదు , రూ 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఎందుకు ఆదేశించకూడదని సీఎస్ ను ప్రశ్నించింది . ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని సంఘటన చోటు చేసుకున్న అనంతరం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పరిహారం ఇప్పించాలని ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయమై గత వారంలో ఎంసీహెచ్ఆర్డీలో కూడా ఎన్ హెచ్ఆర్సీ విచారణ చేపట్టింది.

Next Story