- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరం : టీఎస్ యూటీఎఫ్
దిశ, రాంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర యుటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్ మాట్లాడారు.

దిశ, రాంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర యుటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్ మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా సదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో కామ్రేడ్ సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం, కామ్రేడ్ రావెళ్ళ రాఘవయ్య వేదికలో జరగనున్నాయని, సంబంధిత గోడపత్రికలను, ఆహ్వానాలను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో ఎన్జీవో ల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కానీ అందుకు బదులుగా ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఏర్పాటు చేస్తున్న క్లాసులు నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వండి. బోధనేతర పనుల భారం నుండి విముక్తులను చేయండి. ఆన్లైన్ నివేదికలు పంపడానికి బోధనేతర సిబ్బందిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 45 వేలమంది, దేశవ్యాప్తంగా 25 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్న టెట్ పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎ సింహాచలం, ఎం వెంకటప్ప, కొండలరావు, సీనియర్ నాయకులు డి మస్తాన్ రావు, సిహెచ్ వి రాజన్ బాబు, వెంకటేశ్వర్లు, రమేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.






