శ్రీ కర్మన్ ఘాట్ దేవస్థానానికి కొత్త పాలక మండలి

by Taduka Kalyani |

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

శ్రీ కర్మన్ ఘాట్ దేవస్థానానికి కొత్త పాలక మండలి
X

దిశ, చంపాపేట్ , జూలై 16: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ కర్మన్ఘాట్ హనుమాన్ దేవస్థానం నూతన పాలక మండలి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేవస్థానం పాలక మండలిలో సభ్యులుగా సేవలందించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన భక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 20 రోజుల లోపు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వం నిబంధనల ప్రకారం కొత్త పాలక మండలిని నియమించనుంది. ఈ మేరకు అర్హులైన వారు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ అంశానికి విస్తృత ప్రచారం కల్పించి, ఎక్కువ మంది అర్హులైన భక్తులకు సమాచారం చేరేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలని శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. లావణ్య విజ్ఞప్తి చేశారు.

Next Story