హైదరాబాద్ లో పట్టుబడ్డ మయాన్మార్ దేశస్థులు.. 14 ఏళ్లుగా..

by Bhanu |   (  Updated:2025-05-20 15:27:59  IST  )

మయన్మార్ దేశానికి చెందిన నలుగురిని మంగళవారం రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ లో పట్టుబడ్డ మయాన్మార్ దేశస్థులు.. 14 ఏళ్లుగా..
X

దిశ, సిటీక్రైం : మయన్మార్ దేశానికి చెందిన నలుగురిని మంగళవారం రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. 14 సంవత్సరాల కిందట మయన్మార్ దేశం నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఈ నలుగురు తప్పుడు పత్రాలను సమర్పించి భారత దేశ ఆధార్ కార్డు, గ్యాస్ బుక్, పాన్ కార్డులను పొందినట్లు పోలీసులు గుర్తించారు. మదర్పాలో పని చేసే టీచర్లు ఈ పత్రాల తయారీ భాగోతం లో కీలకంగా పని చేశారని తేలింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ అమీన్ , అతని భార్య మహ్మద్ రుమానా అక్తర్ , వీరి కుమారుడు మహ్మాద్ నయిమ్ లు 2011 సంవత్సరంలో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ తర్వాత 2014 లో హైదరాబాద్ కు చేరుకుని పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలో నివాసం ఉన్నారు.



స్థానికంగా ఓ బ్యాటరీ షాపును నడిపిస్తున్న మహ్మాద్ అమీన్ మదర్సాలో టీచర్ గా పని చేస్తున్న మహ్మాద్ హారీస్ , అయాజ్ తో కలిసి మంచాల గ్రామంలోని మీ-సేవా ద్వారా ఆధార్ కార్డును తీసుకున్నాడు. నకిలీ మ్యారేజీ సర్టిఫికేట్ ను తయారు చేసి అతని భార్య రుమానా అక్తర్ కు కూడా ఆధార్ కార్డును తీసుకున్నాడు. అతని కుమారుడు నయిమ్ కు మయన్యార్ నుంచి అక్రమంగా వచ్చి బాలాపూర్ లో స్థిరపడ్డ షోయబ్ మాలిక్ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డును ఇప్పించాడు. ఇలా ఈ కుటుంబం తప్పుడు పత్రాలను సమర్పించిన భాగోతం పై పోలీసులకు సమాచారం అందడంతో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. స్థానిక ఆధార్ కార్డులతో వీరు ప్యాన్ కార్డులు, గ్యాస్ బుక్ లు, బ్యాంక్ ఖాతాలు, పాసుబుక్ లు ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహాకరించిన అయాజ్, షోయబ్ మాలిక్ లు పరారీలో ఉన్నారు.

Next Story