అహర్నిశలు పని చేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Yella Dhawani Reddy |

అహర్నిశలు పని చేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, ముషీరాబాద్: తనను గెలిపించిన ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ శాసనసభ్యుడిగా ముఠా గోపాల్ గెలిచి మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.రాకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రా కేఫ్ చౌరస్తాలో సంబురాలు జరిగాయి. ఈ సంబురాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతోని తాను గెలిచి మూడేళ్లు పూర్తి చేసుకున్నానని అన్నారు. తనను గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు పని చేయడానికి సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, సీనియర్ నాయకులు ముఠా నరేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, నాయకులు ఆకుల శ్రీనివాస్, మారిశెట్టి నర్సింగ్ రావు, ఎర్రం శ్రీనివాస్ గుప్త, జి.పరశురామ్, జి.వెంకటేష్, పాశం రవి, హనుమంతు, జహంగీర్, దేవయ్య, విఠల్, అజయ్, సురేష్ కమర్, కుమారస్వామి, యాదగిరి, బాబురావు, రాము, సుధా, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story