లంచం అడిగాడు బుక్కయ్యాడు.. ఏసీబీ వలలో ముషీరాబాద్ ఆర్‌ఐ

by Bhanu |

ముషీరాబాద్ తాహసీల్దార్ కార్యాలయంలో లంచం ఉదంతం చోటుచేసుకుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడానికిగాను రూ.25,000 లంచం తీసుకుంటూ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్‌ఐ) భూపాల మహేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

లంచం అడిగాడు బుక్కయ్యాడు.. ఏసీబీ వలలో ముషీరాబాద్ ఆర్‌ఐ
X

దిశ, రాంనగర్ : ముషీరాబాద్ తాహసీల్దార్ కార్యాలయంలో లంచం ఉదంతం చోటుచేసుకుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడానికిగాను రూ.25,000 లంచం తీసుకుంటూ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్‌ఐ) భూపాల మహేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ముషీరాబాద్‌లో కలకలం రేపింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, లంచం కోరుతున్న విషయాన్ని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా, అధికారులు తక్షణమే దాడికి ఉపక్రమించారు. ఎటువంటి సందేహాలకు తావులేకుండా తాహసీల్దార్ కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా భూపాల్ మహేష్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముషీరాబాద్ తాహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆధ్వర్యంలో సుదీర్ఘ విచారణ కొనసాగుతోంది. సంబంధిత డాక్యుమెంట్లు, లావాదేవీల వివరాలు, అధికారుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజలు సరైన డాక్యుమెంట్లను పొందేందుకు కూడా లంచాల బారిన పడాల్సి వస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.




Next Story