- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 ఏళ్లకు చదువులమ్మ ఒడిలో పూర్వ విద్యార్థుల సందడి
హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ (ముషీరాబాద్-బోరబండ)స్కూల్(APR SCHOOL) విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అక్టోబర్ 11 శనివారం నాడు ఘనంగా జరిగింది. స్కూల్ లో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకొని సంతోషంగా గడిపారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ (ముషీరాబాద్-బోరబండ)స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అక్టోబర్ 11న ఘనంగా జరిగింది. స్కూల్‌లో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకుని ఎంతో సంతోషంగా గడిపారు. పాత స్నేహితులు ఒకరినొకరు పలకరించుకుంటూ మంచీ చెడు, చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఇన్నేళ్ల తర్వాత పాత స్నేహితులు అంతా స్కూలు ప్రాంగణంలో కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రిన్సిపాల్ బీవీ రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీవేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, టీచర్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆనందంగా గడిపారు. ప్రిన్సిపాల్ బీవీ రమణమూర్తి మాట్లాడుతూ.. గతంలో ఎదుర్కొన్న సాదక బాధకాలను వివరించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఎలాంటి స్పూర్తిని నింపుకోవాలో సూచనలు చేశారు. పాత స్నేహితులు ఇలా ఏదో ఒక సమయంలో కలుసుకుంటూ సంతోషంగా గడిపితే మంచి బంధం ఏర్పడుతుందని పేర్కొన్నారు.






