- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజియాలు జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలు
మ్యూజియాలు కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావని, అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం తెలంగాణ చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని, ఈ వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలపాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు, సందర్శకులకు మెరుగైన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా గైడ్ లకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రంగాల్లో నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారసత్వ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, యువత మ్యూజియాలను సందర్శించి చరిత్రపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ మన్యూమెంట్ ఫండ్ బోర్డు మెంబర్ షాలిని భూపాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, కేంద్ర పురావస్తు శాఖ సూపరిన్టెండెంట్ నిఖిల్ దాస్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేద కుమార్, ఇంటాచ్ కన్వీనర్ అనురాధ రెడ్డి, చరిత్రకారులు డా. ఈమని శివనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






