ఇంటి అడ్రస్ మర్చిపోయిన టాలీవుడ్ హీరో.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

by Web Desk |
ఇంటి అడ్రస్ మర్చిపోయిన టాలీవుడ్ హీరో.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?
X

దిశ, బంజారాహిల్స్: మద్యం మత్తులో టాలీవుడ్ హీరో బీభత్సం సృష్టించాడు. జూబ్లీహిల్స్‌లో ఉండే ఇంటిని మర్చిపోయిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్ బంజారాహిల్స్ బస్తీలోకి వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన ఉండే వాహనాలను ఢీకొట్టాడు. దీంతో అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71లో నివసించే దాసరి అరుణ్ కుమార్ బుధవారం ఫిలింనగర్‌లోని స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం స్నేహితులతో కలిసి కారులో వస్తూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్ నగర్ బస్తీలోకి వేగంగా తన కారును నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న కార్లను ఢీకొట్టాడు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భారీ సౌండ్ విని కారును ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అరుణ్ కుమార్ కార్ సీజ్ చేశారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన ఇంటి అడ్రస్ మర్చిపోయానని అరుణ్ కుమార్ పోలీసులు ఎదుట చెప్పినట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed