250 కేసుల్లో నిందితుడు మోస్ట్ వాంటేడ్ లంబా అరెస్టు..

by Bhanu |

హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ సయ్యద్ హూస్సేన్ అలియాస్ లంబాను మంగళవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

250 కేసుల్లో నిందితుడు మోస్ట్ వాంటేడ్  లంబా అరెస్టు..
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ సయ్యద్ హూస్సేన్ అలియాస్ లంబాను మంగళవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ నవాబ్ సాబ్ కుంటా ప్రాంతానికి చెందిన సయ్యద్ హూస్సేన్ అలియాస్ లంబా స్నాచింగ్, దోపీడీలు, హత్యాయత్నాలు, గంజాయి దందా ఇంకా ఇతర నేరాలకు పాల్పడుతు హైదరాబాద్, సైబరాబాద్ , రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటేడ్ గా మారాడు. అతని పై మొత్తం 250 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులలో తప్పించుకుని తిరుగుతున్న లంబాను సీసీఎస్ పోలీసులు మారుతి కారులో 21 కిలోల గంజాయితో పాటు అతని అనుచరులు అమీర్ ఖాన్, ఫారూక్ ఖాన్, గౌసు, మహ్మాద్ అజామ్ ఖాన్ లను అరెస్టు చేశారు. లంబా కొన్ని కేసులలో తప్పించుకుని తిరుగుతుండగా, సైఫాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ పెండింగ్ లో ఉందని పోలీసులు తెలిపారు.

Next Story