- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ మారే ఆలోచన లేదు.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
పార్టీ మారే ఆలోచన లేదు.. నాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల నమ్మవద్దని నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నా శ్రేయోభిలాషులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, ఎల్బీనగర్ : పార్టీ మారే ఆలోచన లేదు.. నాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల నమ్మవద్దని నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నా శ్రేయోభిలాషులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కేటీఆర్ సమక్షంలో జరిగిన మీటింగ్ కి ఆహ్వానం లేకపోవడంతో వెళ్లలేకపోయానని సుధీర్ రెడ్డి అన్నారు.
మీటింగ్ కు వెళ్లకపోవడంతో సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ వార్తలు కేవలం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారమని సుధీర్ రెడ్డి ఖండించారు. గత 2018 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ మారానని, 40 సంవత్సరాలు రాజకీయంలో ప్రజలతో కలిసి మెలిసి అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నానని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఇక పార్టీ మారేది లేదని అదే మొదటిసారి చివరిసారి కూడా అని తన పై వస్తున్న వదంతులను నమ్మవద్దని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.






