- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐజీ ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
నగరంలో ప్రపంచ అందగత్తెల సందడి కొనసాగుతుంది. నగరంలోని పలు పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను సందర్శించిన మిస్ వరల్డ్ భామలు శుక్రవారం ఉదయం గచ్చిబౌలి ఎఐజీ ఆస్పత్రిని సందర్శించారు.

దిశ, శేరిలింగంపల్లి : నగరంలో ప్రపంచ అందగత్తెల సందడి కొనసాగుతుంది. నగరంలోని పలు పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను సందర్శించిన మిస్ వరల్డ్ భామలు శుక్రవారం ఉదయం గచ్చిబౌలి ఎఐజీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలను, ఆస్పత్రి స్పెషలైజేషన్ తదితర అంశాలకు సంబంధించి ఆస్పత్రి సేవలను అక్కడి వైద్యులు మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించారు. మెడికల్ టూరిజంలో భాగంగా హాస్పిటల్ లో జరుగుతున్న వైద్యం, స్పెషాలిటీస్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ..
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక పాత్రలను పోషిస్తున్నారని, తల్లులుగా, కుమార్తెలుగా, ఆరోగ్య సంరక్షణ కార్మికులుగా, వృత్తిపరమైన పనిచేస్తున్నారన్నారు. మహిళల ఆరోగ్యం అనేది ఒక మౌలికాంశమని అర్థం చేసుకోవడం అత్యంత కీలకమన్నారు. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మహిళలుగా మనం ప్రాధాన్యతనిస్తే, మనం మన కార్యాలయాలు, సమాజం మొదలైన వాటిలో మన బలాన్ని బలపరిచినవారిగా నిలబడతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని క్రిస్టినా అన్నారు. మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అధునాతన హాస్పిటల్లలో సేవలు అందిస్తున్నామని అన్నారు. మెడికల్ కాలేజీలలో అన్ని సౌకర్యాలు ఉండేలా రూపాకల్పన చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఏఐజీ ఆస్పత్రి పరిసరాలలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






