Minister Seethakka : వాహనదారునికి మూర్ఛ... కాన్వాయ్ ఆపి సహాయం చేసిన సీతక్క

by Muthe.Rajitha |

మంత్రి సీతక్క(Minister Seethakka) మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది.

Minister Seethakka : వాహనదారునికి మూర్ఛ... కాన్వాయ్ ఆపి సహాయం చేసిన సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి సీతక్క(Minister Seethakka) మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌(Hyderabad)లోని పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద ఓ వాహనదారుడు మూర్ఛ వ్యాధితో(Fits) పడిపోయాడు. సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క తన కాన్వాయ్‌ను ఆపి, వెంటనే ఆ వ్యక్తి వద్దకు చేరుకుని సపర్యలు(First Aid) చేశారు. అతని చేతిలో తాళం చెవులు పెట్టి అతడు స్పృహలోకి వచ్చే వరకు సహాయంగా ఉన్నారు.

అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు చేశారు సీతక్క. మంత్రి స్థాయిలో ఉండి కూడా అధికారులకు అప్పగించకుండా.. తానే దగ్గరుండి సపర్యలు చేయడాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. ఆమె గతంలో కూడా పలు సందర్భాల్లో చూపిన సామాజిక సేవను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్స్. సీతక్క సత్వర చర్యల వల్ల వాహనదారుడు సకాలంలో వైద్య సహాయం పొందాడని సమాచారం.

Next Story