మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను.. పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి

by Bhanu |

హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను .. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పరామర్శించారు.

మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను.. పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వనస్థలిపురం : హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను .. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పరామర్శించారు. యాక్సిడెంట్​లో చనిపోయిన ముగ్గురు చంద్రసేనారెడ్డి, త్రినాథ్​ రెడ్డి, వర్షిత్ రెడ్డి ఇండ్ల వద్దకు వెళ్లి మృతదేహాలకు నివాళి అర్పించారు. వారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కారు ఎక్కగానే చిన్నవారైనా.. పెద్దవారైనా సీటు బెల్టు ధరించాలి. ఈ ప్రమాద ఘటనలో సీటు బెల్టు పెట్టుకున్న యువకుడు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా ముగ్గురు చనిపోయారు. యువకులు ఎవరైనా ఓవర్​స్పీడ్​తో డ్రైవింగ్​చేసే ముందు ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి. వేగాన్ని నియంత్రించుకోవాలి’ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దు . రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి వెంకట్​రెడ్డి తో పాటు రాష్ట్ర రోడ్డు డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​ మల్​రెడ్డి రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్​ శ్రీనివాస్​గౌడ్​, కాంగ్రెస్​ నాయకులు సుప్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story