పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి చేశాం: మంత్రి జగదీష్ రెడ్డి

by Disha Web Desk 16 |
పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి చేశాం: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌లో ద‌శాబ్ద కాలంలోనే శ‌తాబ్ద కాలంలో చేయాల్సిన ప‌నులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బుధవారం బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష, పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశం ముగిసిన అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్సవాల నిర్వహ‌ణ‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసిన‌ట్లు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు ఏ పార్టీ చేయ‌ని అద్భుతాలు, విజ‌యాల‌ను ఈ ప‌దేండ్ల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ సాధించింద‌ని తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు చేసిన ప‌నుల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజ‌యాల‌ను పార్టీ ప‌రంగా కార్యక‌ర్తల ద్వారా ప్రజ‌ల‌కు వివ‌రించాలన్నారు. అనేక రంగాల్లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా రైతాంగానికి 24 గంట‌ల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంద‌ని, మిషన్ భగీరథ పథకంతో చెరువుల పునరుద్దరణతో భూగ‌ర్భ జ‌లాలు ఉబికి వ‌స్తున్నాయన్నారు. వ్యవ‌సాయ రంగంలో దేశ‌మంతా ఇబ్బంది ప‌డుతుంటే.. తెలంగాణ‌లో మాత్రం వ్యవ‌సాయాన్ని పండుగ‌లా మార్చామన్నారు.


Next Story

Most Viewed