- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మసీ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఫార్మసీ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోధర రాజనర్సింహా హామీ ఇచ్చారు.

దిశ, హిమాయత్ నగర్: ఫార్మసీ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోధర రాజనర్సింహా హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ అసోసియేట్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్ ఆధ్వర్యంలో మంత్రి దామోదర్రా జనర్సింహాను బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కలిసి ఫార్మసీ ఆఫీసర్ల సమస్యలు విన్నవించారు. అనంతరం ఆయనను పూలబొకే, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పీహెచ్సీలో అదనంగా ఇద్దరు ఫార్మసీ ఆఫీసర్ పోస్టులు ఇవ్వాలని కోరారు. ప్రతి పీహెచ్సీలో డాటా ఎంట్రీ పోస్టును మంజూరు చేయాలని అలాగే ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42 ప్రకారం... ప్రతి పల్లె బస్తీ దవఖానాల్లో ఫార్మసీ ఆఫీసర్స్‌ను నియమించాలని కోరారు. ఆయా సమస్యలపై మంత్రి రాజనర్సింహా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.శరత్ బాబు , ఉపాధ్యక్షుడు ఉదయ్ ప్రసాద్, పద్మజ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వి.శ్రీహరి, జనరల్ సెక్రెటరీ ఆనందకుమార్, నాయకులు కళ్యాణ్, రాధిక, అలేఖ్య, అర్చన, భాను ప్రియ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.






