కార్మిక సంఘాల సమిష్టి కృషితో మే డే పోస్టర్ విడుదల

by Bhanu |

తెలంగాణ భవన నిర్మాణ చైతన్య కార్మిక యూనియన్, కార్మిక హక్కుల పోరాట సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన "మే డే" వాల్ పోస్టర్‌ను బుధవారం హైదరగూడలోని ఎన్ఎస్ఎస్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

కార్మిక సంఘాల సమిష్టి కృషితో మే డే పోస్టర్ విడుదల
X

దిశ, హిమాయత్ నగర్: తెలంగాణ భవన నిర్మాణ చైతన్య కార్మిక యూనియన్, కార్మిక హక్కుల పోరాట సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన "మే డే" వాల్ పోస్టర్‌ను బుధవారం హైదరగూడలోని ఎన్ఎస్ఎస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూ జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు తెలంగాణ భవన నిర్మాణ చైతన్య కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి కేసీఎస్ ప్రసాద్, నేతలు ఇ.బాబు, కార్మిక హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడు సురుగు ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండటంతో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో కార్మిక లోకం సంఘటితంగా మే డేను స్ఫూర్తిగా తీసుకొని తమ హక్కులను సాధించుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.




Next Story