పంజాగుట్ట to అమీర్పేట్.. 2 గంటల జర్నీ.. వాహనదారులకు చుక్కలే

by Muthe.Rajitha |   (  Updated:2025-08-07 17:15:26  IST  )

హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం(Massive Rains) వాహనదారులకు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది.

పంజాగుట్ట to అమీర్పేట్.. 2 గంటల జర్నీ.. వాహనదారులకు చుక్కలే
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం(Massive Rains) వాహనదారులకు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. నగరంలో నేడు కురిసిన భారీ వర్షానికి 12 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు కాగా... రోడ్లు ఎటు చూసినా చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఒక వైపు భారీ వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసులు వదిలే సమయానికి కుండపోత వాన పడటంతో జనజీవనం అల్లకల్లోలం అయ్యింది. ఐటీ కారిడార్ సహా పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం దెబ్బకు వాహనదారులు విలవిలలాడుతున్నారు. పంజాగుట్ట నుంచి అమీర్పేట్ కు ప్రయాణం కేవలం 5 నిముషాలే అయినా ట్రాఫిక్ వల్ల 2 గంటలు పట్టింది. ఇలా ప్రతీ కీలక జంక్షన్స్ లో ఇదే పరిస్థితి ఉందని వాహనదారులు వాపోతున్నారు.

READ MORE .....

Big Alert: ఈ రాత్రి జాగ్రత్త


Next Story