దివ్యాంగుల హక్కుల కోసం రాజీలేని పోరాటం : మందకృష్ణ మాదిగ

by Bhanu |

తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగుల హక్కుల సాధనకు శక్తివంతమైన ఉద్యమంగా నిలిచిన ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్‌లకు ఘన చరిత్ర ఉందని, ఇకపై దివ్యాంగులకు రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం వచ్చేంత వరకు ఆత్మబంధువుగా పోరాటం కొనసాగిస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

దివ్యాంగుల హక్కుల కోసం రాజీలేని పోరాటం : మందకృష్ణ మాదిగ
X

దిశ, వనస్థలిపురం: తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగుల హక్కుల సాధనకు శక్తివంతమైన ఉద్యమంగా నిలిచిన ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్‌లకు ఘన చరిత్ర ఉందని, ఇకపై దివ్యాంగులకు రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం వచ్చేంత వరకు ఆత్మబంధువుగా పోరాటం కొనసాగిస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. పద్మశ్రీ అవార్డుతో తన భాధ్యతలు మరింత పెరిగాయని, ఇది సమాజంలోని అణచివేతకు గురైన వర్గాల ప్రయోజనాల రక్షణకు కట్టుబడి పనిచేయాల్సిన స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. అన్ని వర్గాల కోసం, కులం మతం చూడకుండా ప్రజల మధ్య ఉండే నాయకుడిగా కొనసాగుతానని తెలిపారు.

ఈ కార్యక్రమానికి వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షత వహించగా, జాతీయ కోర్ కమిటీ చైర్మన్ గోపాలరావు, వైస్ చైర్మన్ అందె రాంబాబు, జాతీయ అధ్యక్షుడు సుజాత సూర్యవంశీ, మహిళా అధ్యక్షురాలు సామినేని భవాని చౌదరి, ఏపీ అధ్యక్షుడు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్ తదితరులు హాజరయ్యారు.


Next Story