ఎంబీబీఎస్ ​సీట్లు ఇప్పిస్తామని మోసం.. 52 లక్షలు స్వాహా

by Bhanu |   (  Updated:2025-04-30 15:53:32  IST  )

ఎంబీబీఎస్​సీటు ఇప్పిస్తానంటూ రూ. 52 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని హయత్​నగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎంబీబీఎస్ ​సీట్లు ఇప్పిస్తామని మోసం.. 52 లక్షలు స్వాహా
X

దిశ, వనస్థలిపురం: ఎంబీబీఎస్​సీటు ఇప్పిస్తానంటూ రూ. 52 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని హయత్​నగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హయత్​నగర్​సీఐ నాగరాజు గౌడ్​, బాధితులు బాలునాయక్​ వివరాల ప్రకారం.. హయత్​నగర్​ పరిధిలోని గౌతమ్​నగర్​కు చెందిన కుక్కడపు చంద్రకాంత్ గౌడ్(37) అలియాస్ టింకూ బాయ్ కు , జడ్చర్ల మండలం మల్లెబోయిన పల్లి గ్రామానికి చెందిన ముడావత్​బాలు నాయక్​కుమారుడు సంతోష్​చౌహాన్( ఎంబీబీఎస్​చదివే విద్యార్థి) తో వనస్థలిపురంలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చంద్రకాంత్​గౌడ్​ కరీంనగర్‎లోని చెలిమెడ మెడికల్ కాలేజీలో సంతోష్​చౌహాన్ కు ఎంబీబీఎస్ మేనేజ్​మెంట్​కోటా​ సీటు ఇప్పిస్తానని అతడి తండ్రి బాలునాయక్​తో రూ. 98 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. విడతల వారీగా బాలునాయక్​చంద్రకాంత్​గౌడ్​ అతడి భార్య ఉమారాణికి రూ. 52 లక్షలు చెల్లించారు.

కానీ సంతోష్​చౌహాన్​కు గవర్నమెంట్​కౌన్సెలింగ్​లోనే ఎంబీబీఎస్​ సీటు రావడంతో .. మేనేజ్​మెంట్​కోటా సీటు అవసరం లేదని, తాము ఇచ్చిన నగదు తమకు తిరిగి ఇవ్వాలని కోరారు. చంద్రకాంత్​గౌడ్​ తీసుకున్న రూ. 52 లక్షలలో నుంచి రూ. 26 లక్షలు తిరిగి బాలు నాయక్​కు ఇచ్చారు. మిగతా రూ. 26 లక్షలు ఇవ్వకుండా గత మూడేండ్లుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రశ్నించినా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తనకు అధికార పార్టీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని బెదిరిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్​కాంగ్రెస్​నాయకులతో కలిసి దిగిన ఫోటోలను కూడా బాధితులకు చూపిస్తూ .. మీరు ఆఫ్ట్రాల్​గిరిజనులు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. మంగళవారం హయత్​నగర్​పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే హయత్​నగర్​పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కోర్టు సూచన మేరకు నిందితుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని పేర్కొన్నామని సీఐ నాగరాజు గౌడ్​తెలిపారు. నోటీసులు అందుకున్న వారు భవిష్యత్‌లో ఎలాంటి నేరం చేయవద్దని సూచించినట్లు తెలిపారు.

Next Story