వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి...మియాపూర్‌లో దుర్ఘటన

by Bhanu |   (  Updated:2025-04-30 17:51:50  IST  )

అతివేగం, నిర్లక్ష్యత వల్ల ఓ వ్యక్తి బలైపోయిన విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి...మియాపూర్‌లో దుర్ఘటన
X

దిశ, శేరిలింగంపల్లి: అతివేగం, నిర్లక్ష్యత వల్ల ఓ వ్యక్తి బలైపోయిన విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మదీనగూడ అర్చన ఆసుపత్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం – ప్రైవేట్ ఉద్యోగి అశోక్ (41) బుధవారం రాత్రి చందానగర్ నుంచి మియాపూర్ వైపు తన ద్విచక్ర వాహనం (TS 08 KC 1659)పై వెళ్తుండగా, వేగంగా వెనక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ (TS 07 UM 9227) అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ ఘటనాస్థలంలోనుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Next Story