- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంత ఖర్చయినా భరిస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, చైతన్యపురి : విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
విద్యార్థులతో మాట్లాడిన ఆయన, వారి భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. 1901లో అనాథ విద్యార్థుల కోసం ఈ పాఠశాల స్థాపించబడిందని, 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దీనికి ‘విక్టోరియా మెమోరియల్ స్కూల్’గా నామకరణం చేశారని గుర్తు చేశారు.
ఇక్కడి విద్యార్థుల సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భవనానికి తగిన మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, అసాంఘిక శక్తుల ప్రభావాన్ని నివారించేందుకు స్కూల్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించనున్నామని, ఇందుకోసం విద్యుత్ శాఖ నుండి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రూ.1106 కోట్లు ఖర్చు చేసి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అధిక ప్రగతిని సాధించి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ విజయేంద్ర ప్రసాద్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజా, ట్రాన్స్ కో సిఎండీ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డిడి రామారావు, ఇంచార్జి ప్రిన్సిపల్ లక్ష్మీ పార్వతి, నాయకులు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్త, దేప భాస్కర్ రెడ్డి, పున్న గణేష్ తదితరులు పాల్గొన్నారు.






