- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
by Muthe.Rajitha |
హైదరాబాద్ నగర శివార్లలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర శివార్లలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బడా వెంచర్ లో 52 అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణాల్లో పనిచేసేందుకు వచ్చిన వలస కార్మికుల కోసం రేకుల షెడ్లు ఏర్పాటు చేసారు. గురువారం ఉదయం అంతా నిర్మాణ పనుల్లో ఉండగా.. షెడ్లలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి.
ఘటన సమయంలో షెడ్లలో కార్మికులు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో మరో మూడు సిలిండర్లు కూడా పేలినట్లు స్థానికులు తెలిపారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






