- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు ధర పలికిన మైహోం భుజా వినాయకుడి లడ్డూ
వినాయకుడి లడ్డూ వేలం అనగానే టక్కున గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డు. ప్రతీ సంవత్సరం అత్యధిక ధర పలుకుతూ రికార్డులు సృష్టిస్తుంది బాలాపూర్ లడ్డు.

X
దిశ, శేరిలింగంపల్లి : వినాయకుడి లడ్డూ వేలం అనగానే టక్కున గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డు. ప్రతీ సంవత్సరం అత్యధిక ధర పలుకుతూ రికార్డులు సృష్టిస్తుంది బాలాపూర్ లడ్డు. అంతకు మించి అనేలా బాలాపూర్ లడ్డూతో పోటీపడుతుంది మాదాపూర్ మైహోం భుజా లడ్డూ. ఈసారి వేలంపాటలో గత ఏడాది కంటే అత్యధిక ధరకు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది మై హోమ్ భుజా లడ్డు రూ.25.5 లక్షలకు సొంతం చేసుకోగా, ఈసారి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ రూ. 29 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నాడు. బాలాపూర్ గణేష్ లడ్డూ గత ఏడాది రూ. 27 లక్షలకు వేలంలో అమ్ముడైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో వినాయకుడి తో పాటు ఆయన చేతిలోని లడ్డూ కూడా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. భక్తులు గణేష్ ని చేతిలో ఉండే లడ్డూలను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతుంటారు.
Next Story






