Hyderabad : మాగంటి గోపినాథ్ సంతాప సభ.. హాజరైన పలువురు నేతలు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-29 17:13:29  IST  )

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(Maganti Gopinath) సంతాప సభ శనివారం వెంగలరావు నగర్ లో ఏర్పాటు చేశారు.

Hyderabad : మాగంటి గోపినాథ్ సంతాప సభ.. హాజరైన పలువురు నేతలు
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(Maganti Gopinath) సంతాప సభ శనివారం వెంగలరావు నగర్ లో ఏర్పాటు చేశారు. డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్యా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాగంటి గోపినాథ్ చిత్రపటానికి నివాళ్ళు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. గోపినాథ్ ప్రజాప్రతినిధిగా అభివృద్ధి పట్ల చూపిన నిబద్ధత, ప్రజలతో కలిసి పని చేసిన విధానాన్ని కొనియాడారు.

ఈ సభలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డితోపాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, వెంగలరావు నగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, గోపినాథ్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.

Next Story