- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బూత్ లెవెల్ నుంచి యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయండి :మధుయాష్కి
పదేళ్ల బీఆర్ఎస్ పాలనను అంతమొందించడంలో యువజన కాంగ్రెస్ ఎంతో కీలకంగా పని చేసింది అని, కష్టపడిన నాయకులను గుర్తించి పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

దిశ, వనస్థలిపురం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనను అంతమొందించడంలో యువజన కాంగ్రెస్ ఎంతో కీలకంగా పని చేసింది అని, కష్టపడిన నాయకులను గుర్తించి పార్టీ తప్పకుండా ప్రోత్సహిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం మంగళవారం నాగోల్ డివిజన్ రాక్ హిల్స్ కాలనీలోని ఎస్వీఎల్ ఎరీనా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే యూత్ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాలన్నారు . దేశంలో బిజెపిని, ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొనేందుకు యువజన కాంగ్రెస్ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ శక్తి యువజన కాంగ్రెస్కే ఉంది అనేది నేను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేసినప్పుడే... కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఉంటుందన్నారు.
యువజన కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి వారిని నాయకులుగా ప్రోత్సహించే బాధ్యత తమదని పేర్కొన్నారు. నాయకులుగా.. నాయకులను తయారు చేసే బాధ్యత తమదన్నారు. భవిష్యత్తు అంతా యువజన కాంగ్రెస్ నాయకులదే అని.. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో యువజన కాంగ్రెస్ తమదైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , యూత్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవాను , యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






