ప్రాణ‌పాయ స్థితిలో ఉన్న ఇద్ద‌రు చిన్నారుల‌ను ర‌క్షించిన మాదాపూర్ మెడికోవ‌ర్ వైద్యులు

by Ratna Kumari |

మాదాపూర్ లోని మెడికోవ‌ర్ ఆసుప‌త్రిలో వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులకు క్లిష్ట శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు

ప్రాణ‌పాయ స్థితిలో ఉన్న ఇద్ద‌రు చిన్నారుల‌ను ర‌క్షించిన మాదాపూర్ మెడికోవ‌ర్ వైద్యులు
X

దిశ, శేరిలింగంప‌ల్లి : మాదాపూర్ లోని మెడికోవ‌ర్ ఆసుప‌త్రిలో వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులకు క్లిష్ట శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఎనిమిదేళ్ల‌ బాలిక శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షల్లో ఛాతి వెనుక భాగంలో 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్టు గుర్తించారు. ఇది ప్రధాన రక్తనాళమైన అయోర్టా, స్పైనల్ కార్డ్‌కు అత్యంత సమీపంలో ఉంది. ఈ రెండు కేసులు అత్యంత క్లిష్టమైనవి. స్పైనల్ కార్డ్, అయోర్టాకు సమీపంలో ఉన్న కణితిని జాగ్రత్తగా తొలగించామని మెడికోవర్ వైద్యులు ప్రమోద్ రెడ్డి తెలిపారు. సింగిల్ వెంట్రికల్ లోపానికి వ్యక్తిగత ప్రణాళికతో శస్త్రచికిత్స చేశామ‌న్నారు. నాలుగేళ్ల బాలుడిలో సింగిల్ వెంట్రికల్ గుండె లోపానికి శస్త్రచికిత్స చేయడంతో ఆక్సిజన్ స్థాయిలు మెరుగయ్యాయన్నారు.

Next Story