- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విఫలం.. యువతి అదృశ్యం
ప్రేమ విఫలం చెందడతో ఓ యువతి అదృశ్యమైన సంఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, కార్వాన్ : ప్రేమ విఫలం చెందడతో ఓ యువతి అదృశ్యమైన సంఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సి చౌరాయి, మాచిపుర నివాసి అయిన కమలాబాయి తన కుమార్తె కవిత బాయితో కలిసి నివసిస్తున్నారు. కవితా బాయి ఆరు సంవత్సరాల క్రితం ఎదురైన ప్రేమ వైఫల్యం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై చికిత్స పొందుతోంది. గత నెల 29న సాయంత్రం తల్లి కమలా బాయి బయటికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న కుమార్తె కవిత బాయి కనిపించకుండా వెళ్లిపోయింది. తల్లికి తెలిసిన ప్రాంతాల్లో వెతికినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మంగళ్ హాట్ పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా కవిత బాయి రెండు సార్లు ఇలాగే ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. పోలీసుల సహాయంతో క్షేమంగా ఇంటికి చేర్చగలిగామని తల్లి పేర్కొంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.






