- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిక్చర్ లో బల్లి ప్రత్యక్ష్యం
కూకట్పల్లి సర్కిల్ పరిధి కేపీహెచ్‌బీకాలనీలోని లూలూ మాల్ హైపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన మిక్చర్ బాక్స్‌లో ఓ బల్లి కనిపించడంతో కొనుగోలు దారులు అవాక్కయ్యారు.

దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి సర్కిల్ పరిధి కేపీహెచ్‌బీకాలనీలోని లూలూ మాల్ హైపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన మిక్చర్ బాక్స్‌లో ఓ బల్లి కనిపించడంతో కొనుగోలు దారులు అవాక్కయ్యారు. ఇన్టు గెదర్26 పేరుతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా కంటెంట్ క్రియేటర్ అయిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి లూలూ మాల్లోని హైపర్ మార్కెల్లో మిక్చర్ బాక్స్ ఒకటి కొనుగోలు చేసింది. బాక్స్ ఓపెన్ చేసి తమ పిల్లలకు ఇచ్చిన మహిళ మిక్చర్‌లో కరివేపాకులా కనిపించడంతో తీసి చూడగా బల్లి పూర్తిగా నూనేలో ఫ్రై అయిన స్థితిలో కనిపించింది. దీంతో మహిళా తన ఇన్‌స్టా గ్రామ్‌లోని ఇన్టుగెదర్ ఐడి, ఎక్స్ వేదికగా లూలూ మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం గురించి ఓ వీడియో పోస్ట్ చేసింది. చాలా పెద్ద పేరున్న లూలూ మాల్ తమ వద్ద నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నారని, ఎవరు లూలూ మాల్ నుంచి స్నాక్స్ కొనుగోలు చేయకండంటూ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సామాజిక మాధ్యమంలో నెటిజన్లు లూలూ మాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటు సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లూలూ మాల్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






