- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDRA : ఫిబ్రవరిలో హైడ్రా పీఎస్ ప్రారంభం : రంగనాథ్
హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra PS) ఏర్పాటు పనులను కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra PS) ఏర్పాటు పనులను కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ వద్దగల బుద్ధభవన్(BuddhaBhavan)లో హైడ్రా పీఎస్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నేడు పీఎస్ పనుల పురోగతిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటివారంలో హైడ్రా పీఎస్ ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు. హైడ్రా పీఎస్ ఎస్‌హెచ్‌వోగా ఏఎస్పీ స్థాయి అధికారిని, మూడు జోన్లలో ఒక్కో జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా కేసుల సత్వర పరిష్కారానికి హైడ్రా ప్రత్యేక కోర్టు(Hydra Court) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కుల స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా మంజూరు చేసింది.






