- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"లష్కర్" జిల్లా సాధన సమితి ధర్నా
సికింద్రాబాద్ ను లష్కర్ జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ వినతులు, నిరసనలు తీవ్రం అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ ను లష్కర్ జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ వినతులు, నిరసనలు తీవ్రం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి వేరు చేసి ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా నేడు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు దీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌కు చారిత్రకంగా ఉన్న “లష్కర్” పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ కావాలని ఆందోళన నిర్వహించారు. GHMCను 150 నుంచి 300 డివిజన్లకు విస్తరించి శివారు ప్రాంతాలను చేర్చడంతో అసలు సికింద్రాబాద్ ప్రాంత అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం అవుతోందని ఆరోపించారు.
హైదరాబాద్ జిల్లాను రెండుగా విభజించే ప్రతిపాదనల నేపథ్యంలో GHMC విస్తరణను వ్యతిరేకిస్తున్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. కాగా నేటి దీక్షలో మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ నివాసులు పాల్గొన్నారు.






