ఆ జాబితాలోకి ఆదిలాబాద్... మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-10 14:46:30  IST  )

కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని టైర్-2 పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు....

ఆ జాబితాలోకి ఆదిలాబాద్... మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని టైర్-2 పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అందులో భాగంగా నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలలో ఐటీ హబ్‌లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆదిలాబాద్ చేరిందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, టాస్క్ సెంటర్లతో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ఈ ఐటీ హబ్‌ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంకల్పాన్ని కొనసాగించాలని సూచించారు.

Next Story