Breaking: ప్రారంభమైన కేఆర్‌ఎంబీ కీలక సమావేశం

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం కొనసాగుతోంది...

Breaking: ప్రారంభమైన కేఆర్‌ఎంబీ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య వాటర్ పంచాయితీ(Water Panchayat) కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీశైలం, నాగార్జున సాగర్(Srisailam, Nagarjuna Sagar) ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాల(Krishna waters)ను ఏపీ ఎక్కువగా వినియోగించుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఫిర్యాదుతో కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జలసౌధలో ప్రారంభమైన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. జల వివాదాలు, నీటి పంపకాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే తమ వాదనలను తెలంగాణ వినిపించింది. తెలంగాణకు సాగు, తాగు నీరు కోసం 116 టీఎంసీలు అవసరం ఉందని, వెంటనే అందించాలని తెలంగాణ కోరుతోంది.

Next Story