ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వందకోట్ల "రియల్" మోసం..

by Naga Rani Yarlagadda |

నాలుగేళ్ల క్రితం కస్టమర్ల నుంచి వందకోట్లు వసూలు చేసిన సంస్థను.. తమ ప్లాట్లు ఎక్కడ అని ప్రశ్నించగా.. అదిగో ఇదిగో అంటూ సమాధానం దాటవేస్తూ వచ్చారు.

ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వందకోట్ల రియల్ మోసం..
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు పొందవచ్చని ఆశ చూపించి.. బాధితుల నుంచి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేసి కొన్ని కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. తాజాగా ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి.. బాధితులకు డబ్బులివ్వకుండా మోసం చేసిన మరో ఘటన వెలుగుచూసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పి.. క్రితికా ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. బాధితుల ఫిర్యాదుతో సంస్థ ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాలుగేళ్ల క్రితం కస్టమర్ల నుంచి సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన సంస్థను.. తమ ప్లాట్లు ఎక్కడ అని ప్రశ్నించగా.. అదిగో ఇదిగో అంటూ సమాధానం దాటవేస్తూ వచ్చారు. సుమారు 150 మంది నుంచి డబ్బులు తీసుకుని ప్లాట్లు ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. మాయమాటలు చెప్పి తప్పించుకున్నారని చెప్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులు జమ చేసుకుంటున్న సంస్థలు.. బిచాణా ఎత్తేస్తున్నాయి. రియల్ ఎస్టేల్ ముసుగులో అనేక మంది సామాన్యులను నట్టేట ముంచుతున్నారు. బిల్డర్స్ కు రాష్ట్రంలో ఉన్న విచ్చల విడి ఫ్రీడమ్ ను దుర్వినియోగం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు బౌన్సర్లను పెట్టి బెదిరించారని వీళ్ల వల్ల కొన్ని వేల, వందల మంది సఫర్ అవుతున్నారు. కాగా.. ఒక్కొక్కరి నుంచి కనిష్టంగా రూ.40 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Next Story