ఖాళీ స్థలాలను.. ఆటస్థలాలుగా తీర్చిదిద్దాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Bhanu |

హైదరాబాద్ గాంధీ నగర్ డివిజన్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం ముఖ్య అతిధిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

ఖాళీ స్థలాలను.. ఆటస్థలాలుగా తీర్చిదిద్దాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ,రాంనగర్ : హైదరాబాద్ గాంధీ నగర్ డివిజన్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం ముఖ్య అతిధిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి దోహద పడతాయని అన్నారు. దేశంలో,తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థులు యువకులు వివిధ రకాల క్రీడాకారులు ఆడుకోవడానికి కావలసినటువంటి ప్లే గ్రౌండ్స్ కొరత పెద్ద ఎత్తున ఉందన్నారు.


అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా చిన్న ఓపెన్ గ్రౌండ్స్ ఎక్కువగా లేవన్నారు.ఉన్నటువంటి ఓపేన్ గ్రౌండ్స్ కూడా అక్కడ అక్కడ ఆక్రమణకు గురయ్యాయిఅన్నారు.తద్వారా బాల బాలికలకు ఆడుకునే ఆటలకు అవకాశం దొరకడం లేదన్నారు.ఇందుకు సంబంధించి గ్రౌండ్ల ఏర్పాటుకు బస్తీ ,కాలనీ అసోసియేషన్లు సహకరించాలన్నారు.జిహెచ్ఎంసి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఆట స్థలాలను కబ్జాకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story