- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీ జైల్లో మగ్గుతున్న కమటం వెంకటేష్ ను విడుదల చేయాలి
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి జైల్లో మగ్గుతున్న కమటం వెంకటేష్ ను ఇండియాకు తీసుకు వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ కోరారు.

దిశ, హిమాయత్ నగర్ : ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి జైల్లో మగ్గుతున్న కమటం వెంకటేష్ ను ఇండియాకు తీసుకు వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ కోరారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేష్ తల్లి కమటం కాంతమ్మ, కాంగ్రెస్ నాయకులు రామచంద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కమటం వెంకటేష్ కు సౌదీ అరేబియాలో ఉద్యోగం ఇప్పిస్తానని జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం, తిప్పయ్య పల్లికి చెందిన నకిలీ ఏజెంట్ తునికి శేఖర్ రూ.3 లక్షలు తీసుకొని సౌదీ అరేబియా తీసుకువెళ్లి మోసం చేశాడని వెంకటేష్ తల్లి కాంతమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. రాత్రి వేళలో మద్యం దందాలో సౌదీ నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరం వెంకటేష్ ను వదిలిపెట్టగా అక్కడి పోలీసులు దాడి చేసి అరెస్టు చేయడంతో ప్రస్తుతం సౌదీ జైల్లో ఖైదీ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రజాదర్బార్ లో వెంకటేష్ తల్లి కాంతమ్మ ఫిర్యాదు చేయడంతో ఇన్ చార్జి డా.జి.చిన్నారెడ్డి సౌదీ అరేబియా ఎంబాసికి లేఖ రాయాలంటూ ఆదేశించగా.. సీఎం కార్యదర్శి శేషాద్రి ఎంబాసికి లేఖ రాసినట్లు చెప్పారు. ఉద్యోగం కోసం వచ్చిన వెంకటేష్ ను నమ్మించి మోసం చేసిన ఏజెంట్ శేఖర్ ముదిరాజ్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్యను కలిసి విన్నవించగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీకి కమిషన్ లేక ఇవ్వడంతో స్పందించిన ఎస్పీ ఏజెంట్ తునికి శేఖర్ తోపాటు అతనికి సహకరించిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మడిపల్లి లక్ష్మి, ఏటగిరి లక్ష్మి, పారునంది బాబు, సురుగు నాంపల్లి పాల్గొన్నారు.






