మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన బేబీ లాన్ పబ్ యాజమాన్యం.. లైట్లు అన్ని ఆపేసి

by Bhanu |

జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10 లోని బేబీ లాన్ పబ్‌లో ఆర్డర్ చేయని డ్రింక్స్‌కి అదనంగా బిల్లు కట్టమని పబ్ యాజమాన్యం ఓ మహిళను వేధించిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన బేబీ లాన్ పబ్ యాజమాన్యం.. లైట్లు అన్ని ఆపేసి
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10 లోని బేబీ లాన్ పబ్‌లో ఆర్డర్ చేయని డ్రింక్స్‌కి అదనంగా బిల్లు కట్టమని పబ్ యాజమాన్యం ఓ మహిళను వేధించిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ప్రశ్నించిన మహిళపై యాజమాన్యం దురుసుగా ప్రవర్తించి, బూతులు తిడుతూ, కొట్టడానికి కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు మీనల్ మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సోమవారం రాత్రి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ మీనల్ తన తల్లి, చెల్లి, బిజినెస్ పార్టనర్‌తో కలిసి బేబీ లాన్ పబ్‌కి వెళ్లారు. అయితే.. పబ్ మూసే సమయానికి వారి బిల్లు అందించినప్పుడు, బిల్‌లో ఆర్డర్ చేయని డ్రింక్స్‌కి అదనంగా చార్జీలు విధించిన విషయం కనిపించింది. దీనిని గమనించిన మీనల్ పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా, ‘ఆ బిల్లు మీదే.. డబ్బులు కట్టాలి’ అని వారు చెప్పడంతో మాటల గొడవ మొదలైంది.

తర్వాత పబ్ యాజమాన్యం బాధితురాలిపై బూతులు తిడుతూ.. ఆమె ఫోన్‌ను కూడా లాక్కొని తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలికి మద్దతుగా ఉన్న వారి తల్లి, చెల్లిపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. చివరికి పబ్‌లోని లైట్లను ఆపేసి మహిళలపై దాడి చేసినట్లు బాధితురాలు పేర్కొంది. బాధితురాలు మీనల్ మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story