సన్ రూఫ్ తెరిచి నిలబడడం డేంజర్..

by Elthuri vijay kumar |

సన్ రూఫ్ ప్రయాణం చాలా డేంజర్ అంటూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియా లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది.

సన్ రూఫ్ తెరిచి నిలబడడం డేంజర్..
X

సన్ రూఫ్ తెరిచి నిలబడడం డేంజర్..

- అవగాహన కోసం వీడియో పోస్టు చేసిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు

- అలాంటి ప్రయాణం వద్దంటూ విజ్ఞప్తి

దిశ, సిటీ క్రైం : సన్ రూఫ్ ప్రయాణం చాలా డేంజర్ అంటూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియా లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది. కారుపై ఉండే సన్ రూఫ్ వెలుగుతో పాటు స్వచ్ఛమైన గాలి ఆస్వాదించేందుకు ఏర్పాటు చేస్తారని కానీ దానిని తెరిచి నిలబడడం ప్రమాదకరమని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెద్దలు, పిల్లలు ఎవరైనా ఆనందం కోసం ఇలా ప్రమాదకరంగా స్టంట్ లు చేయొద్దంటున్నారు. ఇలా సన్ రూఫ్ తెరిచి నిలబడి వెళ్తున్న కారులో ఓ బాలుడు బారికేడ్ కు తల తగిలి పడిపోయిన వీడియోను షేర్ చేశారు. గణేష్ నిమ్మజ్జనం సందర్బంగా చాలా చోట్ల వైర్లు తెగిపోయి ఉంటాయి. ఇక రానున్న సంక్రాంతి నేపథ్యంలో మాంజా తెగిపోయి వస్తుంటాయి అలాంటి సమయంలో ఈ తరహా సన్ రూఫ్ తెరిచి ప్రయాణం చేయడం ప్రాణం మీదకు తెస్తుందని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story