బిట్సా గ్లోబల్ మీట్ 2026 పోస్టర్‌ను విడుదల చేసిన ఐటీ శాఖ మంత్రి

by Kodari Anjali |

తెలంగాణ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల అంతర్జాతీయ సమ్మేళనం బీజీఎం 2026 పోస్టర్‌ను(BITSAA Global Meet 2026) బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు.

బిట్సా గ్లోబల్ మీట్ 2026 పోస్టర్‌ను విడుదల చేసిన ఐటీ శాఖ మంత్రి
X

దిశ, జూబ్లీహిల్స్: తెలంగాణ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల అంతర్జాతీయ సమ్మేళనం బీజీఎం 2026 పోస్టర్‌ను(BITSAA Global Meet 2026) బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. మూడేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణలో బీజీఎం 2026 చైర్‌పర్సన్ అనిత సాకురు(Anita Sakuru), సీఈఓ మయూర్ పట్నాల పాల్గొన్నారు. జనవరి 9 నుండి 11, 2026 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బీజీఎం 2026లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు సహా వెయ్యి మందికి పైగా గ్లోబల్ లీడర్లు పాల్గొననున్నారు. ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 2026 జనవరి 9న ప్రారంభించనున్నారు.

2026 జనవరి 10న బీజీఎం 2026కు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా ముఖ్య వక్తగా, యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాబ్ చౌదరి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకానున్నారు. ఇది ఈ ఈవెంట్ ప్రాముఖ్యతను, ఆవిష్కరణలు, నాయకత్వం, ప్రపంచ స్థాయి సహకారంపై దానికున్న దృష్టిని మరింత బలోపేతం చేస్తోంది.

Next Story