ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : ఎమ్మెల్యే తలసాని

by Chintha Aamani |   (  Updated:2024-12-11 15:15:44  IST  )

ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై

ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : ఎమ్మెల్యే తలసాని
X

దిశ, బేగంపేట : ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడ లో గల శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ముందుగా పండితులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలో ని అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు.

ఘటన జరిగిన సమయంలో 5, 6 రోజుల పాటు ఈ ప్రాంతం మొత్తం భయానకర పరిస్థితులు ఉండేనని అన్నారు. ఒకరి మనోభావాలు వారికి ఉంటాయని..వాటిని దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఎంతో భక్తితో కొలుచుకునే అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనతో బస్తీవాసులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. భక్తుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నూతన విగ్రహ ప్రతిష్ఠ కోసం తాను చర్యలు చేపట్టగా, అదే సమయంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం ముందుకు వచ్చిందని వివరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బి ఆర్ ఎస్ ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, మహేష్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Next Story