- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రచారం అబద్దం : నిమ్స్ ఆసుపత్రి
హైదరాబాద్ లోని నిమ్స్(NIMS) లో కల్తీకల్లు(Adulteration) కారణంగా మృతి జరిగిందనడం అవాస్తవమని ఆసుపత్రి వర్గాలు ప్రకటన జారీ చేసాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నిమ్స్(NIMS) లో కల్తీకల్లు(Adulteration) కారణంగా మృతి జరిగిందనడం అవాస్తవమని ఆసుపత్రి వర్గాలు ప్రకటన జారీ చేసాయి. నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital) అధికారులు జారీ చేసిన ప్రకటన ప్రకారం... హైదరాబాద్ కు చెందిన అసోది కురుమయ్య అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ జూలై 4న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను నిమ్స్ (నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు తరలించగా, అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి, జూలై 10న మృతి చెందారు.
కురుమయ్య మృతికి పూర్తి కారణం హృదయ సంబంధిత సమస్య అని, ఇది ఇటీవల జర్గిన కల్తీ కళ్ళు సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసోది కురుమయ్య మృతిపై తప్పుడు వార్తలు, కథనాలు ప్రచారం చేయడం సరికాదని ఆసుపత్రి అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా కల్తీ కల్లు ఘటనలో మరో నలుగురు కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు.






