- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూలో జరిగే సెంట్రల్ జోన్ వైస్ ఛాన్స్ లర్ల సమావేశానికి గవర్నర్ కి ఆహ్వానం
దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో 2026 ఫిబ్రవరి 19 నుంచి 20 వరకు జరగనున్న భారతీయ విశ్వవిద్యాలయాల అసోసియేషన్ సెంట్రల్

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో 2026 ఫిబ్రవరి 19 నుంచి 20 వరకు జరగనున్న భారతీయ విశ్వవిద్యాలయాల అసోసియేషన్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్స్ లర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ... ఓయూ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ సౌజన్యంతో జరిగే ఈ సమావేశం “ జ్ఞానం, ఆవిష్కరణల ద్వారా స్యయం సమృద్ధ భారత్ ఆవిష్కరణ” అనే అంశంపై చర్చించనుంది. కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఉన్నత విద్యా సంస్థలను తీర్చిదిద్దటం, సమకాలీన పద్దతులు, ఆవిష్కరణలు, ఉన్నత విద్యాసంస్థల్లో సాంకేతికత పరివర్తన పై రెండురోజుల పాటు ఆయా విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లు, నిపుణులు చర్చిస్తారని ఓయూ వీసీ.. ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు. ఈ సమావేశాల్లో జరి గే చర్చల సారాంశం ఆధారంగా 100వ ఏఐయూ వార్షిక జనరల్ బాడీ సమావేశం, జాతీయ వైస్ చాన్స్ లర్ల సమావేశానికి నివేదిక సమర్పిస్తారు. ఫలితంగా ఉన్నత విద్యలో జాతీయ స్థాయి విధాన నిర్ణయాల చర్చకు ఉప యోగ పడు తుం ది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావటం ద్వారా.... ఆయా విశ్వ విద్యా లయాల వి ద్యా నాయకత్వానికి దిశానిర్దేశం చేయాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కోరారు.






