అంత‌ర్రాష్ట్ర దొంగ హ‌ఫీజుల్ షేక్ అరెస్ట్

by Ratna Kumari |   (  Updated:2026-04-07 11:13:08  IST  )

తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంత ర్రాష్ట్ర దొంగ హఫీజుల్ షేక్ ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

అంత‌ర్రాష్ట్ర దొంగ హ‌ఫీజుల్ షేక్ అరెస్ట్
X

దిశ, హిమాయత్ నగర్ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంత ర్రాష్ట్ర దొంగ హఫీజుల్ షేక్ ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నారాయణగూడ SHO సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా చెందిన హఫీజుల్ షేక్ (37) చీరల డిజైనింగ్ చేస్తుంటాడు. అయితే ఇత‌ను పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని, తాళాలు పగలగొట్టి, ఆ ఇళ్లలోని విలువైన వస్తువులను దొంగిలించేవాడని తెలిపారు. నిందితుడు ఢిల్లీ, కోల్‌కతా, తెలంగాణ రాష్ట్రాలలో పలు నేరాలలో పాలుపంచుకుని జైలుకి వెళ్లి వచ్చాడు. నిందితుడు పలు స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని వివరించారు.

మార్చి 30న మహవీన్ ఫాతిమా, యోగేంద్ర ముఖియాలను నుంచి నగదు 2 లక్షలు , బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదు అందిందని.. సుల్తాన్‌బజార్ ఏసీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని నారాయణగూడ డీఐ అభిలాష్, డీఎస్ఐ సీ.హెచ్. నాగరాజు, క్రైమ్ సిబ్బందితో కలిసి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తన ప్రణాళిక ప్రకారం మరో దొంగతనం చేయడానికి హైదరాబాద్ వచ్చిన నిందితుడిని సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిని క్షుణ్ణంగా విచారించగా.. అతను నారాయణగూడ, సనత్‌నగర్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్స్ పరిధిలో పగటిపూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి 6 నేరాలను అంగీకరించినట్లు ఎం. సైదేశ్వర్ వెల్లడించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ బజార్ ఏసీపీ, నారాయణగూడ ఎస్ హెచ్ ఓ, డీఐ, డీఎస్ఐ, క్రైమ్ సిబ్బందిని ఖైరతాబాద్ జోన్ డీసీపీ అభినందించి, వారికి బహుమతులు అందజేశారు.

Next Story