- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
by Ratna Kumari |
మాదాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ లోని శ్రీచైతన్య కళాశాల సరస్వతి క్యాంపస్ హాస్టల్ లో పూజ రెడ్డి తన రూమ్ లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పూజ రెడ్డి సరస్వతి క్యాంపస్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తోటి విద్యార్థుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పూజ తండ్రి గోపిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.
Next Story






