- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత...
సిగ్నల్ యాప్, స్నాప్ చాట్, డార్క్ నెట్ ల ద్వారా ఓజీ గంజాయితో పాటు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలను మంగళవారం హైదరాబాద్ హెచ్ఎన్ న్యూ, నల్లకుంట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.

దిశ, సిటీక్రైం : సిగ్నల్ యాప్, స్నాప్ చాట్, డార్క్ నెట్ ల ద్వారా ఓజీ గంజాయితో పాటు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలను మంగళవారం హైదరాబాద్ హెచ్ఎన్ న్యూ, నల్లకుంట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.సిగ్నల్ యాప్, స్నాప్ చాట్, డార్క్ నెట్ ల ద్వారా ఓజీ గంజాయితో పాటు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలను మంగళవారం హైదరాబాద్ హెచ్ఎన్ న్యూ, నల్లకుంట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దాదాపు 1.40 కోట్లు విలువ చేసే మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ దందాకు సంబంధించిన చెల్లింపులను హవాలా, క్రిప్టో కరెన్సి లో చెల్లిస్తున్న కోణాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. పట్టుబడ్డ నిందితులందరూ ఉన్నత విద్యాభ్యాసం చేసి మత్తుకు అలవాటు పడి ఇప్పుడు డ్రగ్స్ సరఫరాదారులుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వీరందరూ హైదరాబాద్, బెంగళూరుతో పాటు చెన్నై లో వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజా నల్లకుంట ప్రాంతంలో ఈ నలుగురు డ్రగ్స్ ను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. వీరి అక్రమ దందాను గుర్తుపట్టకుండా ఉండేందుకు డ్రగ్స్ డెలివరీని మొత్తం కొరియర్ ద్వారా చేసే వారని దర్యాప్తులో తెలిసింది. పట్టుబడ్డ నిందితుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన హర్షవర్ధన్, చెన్నై కు చెందిన బి.శ్రీనివాస్ రాహూల్, హైదరాబాద్ కు చెందిన అభిషేక్ , ధావల్ లు ఉన్నారు.
పట్టుబడ్డ నిందితుల డ్రగ్స్ దందా ఇలా....
హర్షవర్ధన్-- మధ్యప్రదేశ్ జబల్ పూర్ ప్రాంతానికి చెందినవాడు. పూణే లోని ఆయెజన్ స్కూల్ ఆఫ్ ఆర్మిటెక్చర్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. సొంతంగా వ్యాపారం చేద్దామని అందుకు డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందాలోకి దిగాడు. దీని కోసం డార్క్ నెట్ లో రెడ్డిట్ కమ్యూనిటీలో చేరి డ్రెడ్ మార్కెట్ కమ్యూనిటీ నుంచి ఓజీ (హైడ్రోప్రోనిక్ గంజాయి)ని సిగ్నల్ యాప్ ద్వారా కొనుగొలు చేస్తున్నాడు. డార్క్ నెట్ ఔన్సు ఓజీ 15 వేలకు కొనుగొలు చేసి దానిని మార్కెట్ 25 వేల రూపాయాలకు అమ్ముతున్నాడు. తన గుర్తింపును పోలీసులు పసిగట్టకుండా ఈ డ్రగ్స్ డెలివరీని మొత్తం కొరియర్ ద్వారా చేస్తున్నాడు. డబ్బులను హవాలా లేదా క్రిప్టో కరెన్సిలో తీసుకుంటున్నాడు.
బి.శ్రీనివాస్ రాహూల్-- చెన్నై ప్రాంతానికి చెందిన వాడు. చెన్నై లోని రాజ లక్ష్మీ ఇనిస్టిట్యూట్ నుంచి 2016 సంవత్స్రంలో బీటెక్ పూర్తి చేశాడు. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. ఇలా గంజాయి అమ్మకం దారులు, సరఫరాదారులతో స్నేహం ఏర్పడి డబ్బులు సంపాదించేందుకు గంజాయి దందాను ఎంచుకున్నాడు. దీని కోసం ఓజీ గంజాయిని స్నాప్ చాట్ ద్వారా కొనుగొలు చేసి వాటిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో విక్రయిస్తున్నాడు.
అభిషేక్ - హైదరాబాద్ కు చెందిన వాడు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ ట్రిపుల్ ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. గంజాయికి అలవాటు పడి స్నాప్ చాట్, సిగ్నల్ యాప్ ద్వారా హర్షవర్ధన్, శ్రీనివాస్ రాహూల్ తో పరిచయం చేసుకున్నాడు. వారి ద్వారా ఓటీ గంజాయి, ఎల్ ఎస్ డి బ్లాట్స్, మ్యాజిక్ మష్ రూమ్స్ ను కొనుగొలు చేస్తున్నాడు. అతను వీటిని సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నాడు.
ధవాల్-సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వాడు. చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సును పూర్తి చేశాడు. హైదరాబాద్ కు వచ్చి లైసెన్స్ ఆర్కిటెక్ట్ గా స్థిరపడ్డాడు. గంజాయి మత్తుకు అలవాటు పడి మొదట అతని కోసం అభిషేక్, హర్షవర్ధన్, శ్రీనివాస్ రాహూల్ నుంచి వాటిని తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని విక్రయించడం ప్రారంభించాడు.
ఈ నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితులు ఏర్పాటు చేసుకున్న టెక్నికల్ రూటును చేధించారు. దానిని అనుసరించి పరిశీలించడంతో హవాలా, క్రిప్టో కరెన్సి చెల్లింపుల విషయాల వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 1380 ఓజీ గంజాయి, 44 ఎల్ ఎస్డి బ్లాట్స్, మ్యాజిక్ మష్ రూమ్స్ 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1.40 కోట్లు ఉంటుందని పోలీసులు అదనపు పోలీసు కమిషనర్ సెట్ అండ్ క్రైమ్స్ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నిందితులను పట్టుకున్న హెచ్ ఎన్ న్యూ, నల్లకుంట పోలీసులను అదనపు సీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర అభినందించారు.






