నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షం.. ఏ ప్రాంతంలో ఎంత శాతం నమోదైందంటే..?

by Malleboina Mahesh |

ఆదివారం రాత్రి తెలంగాణ రాజధాని నగరం అయిన హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.

నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షం.. ఏ ప్రాంతంలో ఎంత శాతం నమోదైందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి తెలంగాణ రాజధాని నగరం అయిన హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్ని చెరువులను తలపించాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగడంతో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎమ్‌సీ సిబ్బంది వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనప్పటికి రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న రాత్రి అత్యధికంగా ముషీరాబాద్‌లో 121 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. అత్యల్పంగా అంబర్‌పేట 55.3 మిల్లీ మీటర్లు నమోదైంది. పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో వర్షపాతం నమోదు వివరాలు

ముషీరాబాద్ -121 మి.మీ

ఉస్మానియా యూనివర్సిటీ -101మి.మీ

మెట్టుగూడ- 95.5 మి.మీ

షేక్‌పేట -94.3 మి.మీ

అడిక్‌మెట్- 93.3 మి.మీ

కప్రా-91.5 మి.మీ

చిలకలగూడ-78.5 మి.మీ

హిమాయత్‌నగర్- 77.3 మి.మీ

నేరేడ్‌మెట్ - 76 మి.మీ

ఉప్పల్- 75.8 మి.మీ

అల్వాల్ - 74 మి.మీ

గచ్చిబౌలి -71.5 మి.మీ

నాంపల్లి- 70.5 మి.మీ

మల్కాజ్గిరి- 70 మి.మీ

మల్లాపూర్ -65.3 మి.మీ

ఫిల్మ్ నగర్ -64.3 మి.మీ

సికింద్రబాద్- 60.5 మి.మీ

ఖాజాగూడ- 59.8 మి.మీ

హబ్సిగూడ- 58.8 మి.మీ

ఆసిఫ్‌నగర్- 56 మి.మీ

అంబర్‌పేట -55.3 మి.మీ

Next Story