మూగజీవాలను స్వేచ్ఛగా జీవించేలా చూడాలి : యాంకర్ రష్మీగౌతమ్..

by Batti.Sumithra |

ప్రతిఒకరు మూగజీవుల సంరక్షణకు కృషి చేస్తూనే స్వేచ్ఛగా జీవించేలా చూడాలని ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ అన్నారు.

మూగజీవాలను స్వేచ్ఛగా జీవించేలా చూడాలి : యాంకర్ రష్మీగౌతమ్..
X

దిశ, మియాపూర్ : ప్రతిఒకరు మూగజీవుల సంరక్షణకు కృషి చేస్తూనే స్వేచ్ఛగా జీవించేలా చూడాలని ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మంజీర పైప్ లైన్ రోడ్డులో డాగీవిల్లే పేరుతో ఏర్పాటు చేసిన బోర్డింగ్ డే కేర్ సెంటర్ ప్రారంబోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ విచ్చేశారు. రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి, నార్కోటిక్స్ ఎస్పీ సునీతారెడ్డి, వెటర్నరియన్, డాక్టర్ ఉమాకాంత్ పాటు వ్యవస్థాపకురాలు అమృతాతో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శునకాలకు మనం పంచే ప్రేమతో 100 శాతం తిరిగి విశ్వాసం చూపుతాయన్నారు.

పెంపుడు జంతువుల యాజమానులు డే కేర్ సెంటర్లో కాకుండా వీలయినంత వరకు తమ వద్దే పెంచుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. ప్రతి ఒకరు మూగజీవుల సంరక్షణకు కృషిచేసి స్వేచ్ఛగా జీవించేలా చూడాలన్నారు. పెంపుడు జంతువులపట్ల బాధ్యతగా ఉండాలని, వీలయినంత వరకు బోనులో వేయకుండా వాటికి నచ్చేలా ఉండేలా చేసినప్పుడే అవి సంతోషంగా ఉంటాయన్నారు. పెంపుడు శునకాలు డే కేర్ సెంటర్లో వదిలి వెళ్ళేటప్పుడు అవి దిగులుతో మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుందని, డే కేర్ సెంటర్లో తోటి శూనకాలతో కలిసి ఉన్నప్పుడు తిరిగి తీసుకెళ్తే మళ్ళీ అదే బాధకు లోనవుతుందని. అందువల్ల పెంపుడు జంతువుల యాజమానులు వీలయినంత వరకు తమ వద్దే స్వేచ్ఛగా పెంచుకోవడం పై దృష్టి పెట్టాలన్నారు. బోనులో ఎనిమిది గంటలు, ఆపై ఉంచాలంటే ఎంతో బాధను భరిస్తాయో అర్థం చేసుకోవచ్చని, చిన్న పిల్లలను ఏ విధంగా చూసుకుంటామో పెంపుడు జంతువులను కూడా అదే విధంగా చూసుకోవాలన్నారు.

Next Story