- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'చెర'బడుతున్నారు..
చెరువులు చెరబడుతున్నారు.. కుంటలు, నాళాలు కుంచించుకుపోయి మడుగులను తలపిస్తున్నాయి.. నాలాలు పిల్లకాలువలు అయ్యాయి.. అక్రమ నిర్మా ణాలు వెలసి పర్యావరణం దెబ్బతింటుంది.

దిశ, బడంగ్ పేట్: చెరువులు చెరబడుతున్నారు.. కుంటలు, నాళాలు కుంచించుకుపోయి మడుగులను తలపిస్తున్నాయి.. నాలాలు పిల్లకాలువలు అయ్యాయి.. అక్రమ నిర్మా ణాలు వెలసి పర్యావరణం దెబ్బతింటుంది. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చెరువులు కుంటల్లో అక్ర మ నిర్మాణాలు వెలిశాయి. గొలుసు కట్టు చెరువుల కోసం తవ్విన కాల్వల కు నాళాల ఇన్స్ పెక్షన్ పాత్‌లు కనిపించడం లేదు. చెరువులు ఆక్రమణకు గురి కావడంతో చిన్నపాటి వర్షా నికే కాలనీలోకి నీరు చేరి ఇళ్లన్నీ దెబ్బతింటున్నాయి. బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్ లో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లకు అనుమతివ్వడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోతుండడమే గాక సగం ప్లాట్లు నీళ్లలోనే ఉం డిపోతున్నాయి. కాలువలు, నాలాలు చదును చేసి వాటిపై ఇళ్లు నిర్మించారు.
బాలాపూర్ మండల పరిధిలో సుమారు 24 చెరువులు, కుంటలు ఉండగా చాలా వరకు ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురైంది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని కు రుమలగూడ, అల్మాస్ గూడ, నాదర్గుల్ మామిడిపల్లి, గుర్రంగూడ పరిధిలోని చె రువులు, నాలలు ఆక్రమణకు గురయ్యా యి. చాలా గ్రామాల్లో వరదల సమయం లో వరద నీరు గొలుసుకట్టు చెరువుల ద్వారా వెళ్లడానికి నిర్మించిన కాలువలు, నాలాలువాటి రూపాలనే కోల్పోయాయి. నాలాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసే ఇన్స్ పెక్షన్ పాత్‌లు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. గుర్రంగూడ మాసబ్ చెరు వు ఎఫ్టీఎల్‌లో అక్రమ వెంచర్లు వెలవడం, బ్యాక్ వాటర్ లో వెంచర్ మొత్తం మునిగి పోవడంతో వందల ప్లాట్లు చెరువులోని మునిగి పోయాయి. అంతేగాక, అదిత్యనగర్ లాంటి కాలనీలకు భారీ వరద రావ డంతో నెలల తరబడి కాలనీ వాసులు వ రదలోనే ఉండాల్సివస్తుంది. నాదర్ గుల్ పరధిలో ఉన్న గొలుసు కట్టు చెరువులైన అచ్చమ్మ కుంట, లింగాల కుంట, సున్నం చెరువు, మర్రి బావి కుం టల వరద వచ్చే నాలలు, కాలువలు అన్ని ఆక్రమణకు గురయ్యాయి.
పట్టించుకోని అధికారులు..
ఇన్ని ఆక్రమణలు జరుగుతున్నా మున్సిప ల్, ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించు కోవడం లేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు హల్ చల్ చేసే అధికారులు రాజకీయనా యకుల వత్తిడికి తలొగ్గుతున్నారు. చెరు వులు, నాలలు, పర్యావరణ పరిరక్షణకు ఏర్పడ్డ హైడ్రాకు కూడా బడంగ్ పేట్ ము న్సిపల్ పరిధిలో జరిగిన ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందా యి. అధికారులు స్పందించి నిర్మాణాల ను తొలగించాలని కోరుతున్నారు.
బడంగ్ పేట్ పరదిలో చెరువులు, కుంటల విస్తీర్ణం:
అల్మాస్ గూడ కోమటికుంట .
కుంట వైశాల్యం 21.27 ఎకరాలు
ఎఫ్ టి ఎల్ +100మీ
కుర్మల్ గూడ కుందలకుంట
ట్యాంక్ వైశాల్యం 8ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ +100 మీటర్లు.
నాధర్ గుల్ లింగాలకుంట
ట్యాంక్ వైశాల్యం 1.699 ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ +553 మీ.
మామిడిపల్లి అక్కమ్మ కుంట .
ట్యాంక్ వైశాల్యం 5.83 ఎకర్స్ ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ 9 89 మీటర్స్.
నాధర్గుల్ లచ్చమ్మ కుంట .
ట్యాంక్ వైశాల్యం 17.69ఎకరాలు
ఎఫ్ టి ఎల్ 572.15
నాదర్గుల్ ఎదిగోని కుంట.
ట్యాంక్ వైశాల్యం 27ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ +100 మీ.
నాదర్గుల్ మర్రి బావికుంట
ట్యాంక్ వైశాల్యం 31. 31 ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ + 97.
బాలాపూర్ పెద్ద చెరువు
వాటర్ స్ప్రెడ్ ఏరియా 2.83 ఎకరాలు ట్యాంక్ వైశాల్యం 57 .5 ఎకరాలు
ఎఫ్ టి ఎల్ పరధి 5.7.
నాదర్గుల్ ఎర్ర వాని కుంట .
టాంక్ విస్తీర్ణం 3.0 ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ +100 మీ.
నాదర్గుల్ కుందలకుంట
ట్యాంక్ విస్తీర్ణం 0.100ఎకరాలు
ఎఫ్ టి ఎల్ +537 మీటర్స్
బండ్ పొడవు157 మీటర్స్
అల్మాస్ గూడ ఎర్ర కుంట.
ట్యాంక్ విస్తీర్ణం 14.8 ఎకరాలు.
ఎఫ్ టి ఎల్ +98.900
కట్ట పొడవు 285.260మి.






